OG Glimpse | ఆకలితో ఉన్న Hungry Cheetah.. భీమ్లానాయక్ రికార్డు బ్రేక్ చేసిన ఓజీ
OG Glimpse | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఓజీ (OG) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఓజీ గ్లింప్స్ మూవీ లవర్స్‌తోపాటు అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.
OG Glimpse | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అభిమానులకు ఊపిరాడకుండా చేద్దామని గట్టిగానే ఫిక్సయ్యాడు. రీసెంట్గా బ్రో సినిమాతో ఫ్యాన్స్ కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ అందించిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఓజీ (OG) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీని సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఓజీ గ్లింప్స్ మూవీ లవర్స్‌తోపాటు అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్టు గ్లింప్స్‌తో చెప్పకనే చెబుతున్నాడు పవర్ స్టార్.
కాగా ఇప్పటికే నెట్టింట వీరవిహారం చేస్తున్న ఓజీ గ్లింప్స్ కు సంబంధించిన వార్త ఒకటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తన సినిమా రికార్డును తానే బీట్ చేసి ఔరా అనిపిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఓజీ గ్లింప్స్ విడుదల చేసిన 24 గంటల్లోనే 730K లైక్స్ రాబట్టి.. మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. గ్లింప్స్ 16 మిలియన్ల వ్యూస్ రాబట్టిందంటే పవన్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో భీమ్లానాయక్ (Bheemla Nayak) సినిమా 728.5K లైక్స్‌తో ముందుండగా.. తాజాగా ఓజీ దాన్ని అధిగమించింది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఓజీ #HUNGRYCHEETAH హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఓజీ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారని తెలిసిందే.
పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) గ్లింప్స్‌ను కూడా అందించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా పవర్ స్టార్ మ్యానరిజంతో గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతూ నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలించింది.

Og Glimpse 1
ఓజీ గ్లింప్స్..
భీమ్లానాయక్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

