Animal Movie | బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ (Huma Qureshi) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ భామ యానిమల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.
యానిమల్ సినిమాపై హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఇలాంటి సినిమాలో తాను కూడా నటించాలని అనుకుంటున్నా. ఒక నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలి. అయితే ఆ సినిమాలు చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. సినిమా అన్నాక ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. అంటూ హ్యూమా చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.