ముంబై : తమిళ మూవీ విక్రమ్ వేధ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌లు తలపడనున్నారు. ఈ మూవీలో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా, సైఫ్ పోలీస్ అధికారి పాత్రలో అలరించనున్నాడని వార్తలు బాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. గత కొద్దినెలలుగా విక్రమ్ వేధ రీమేక్ కోసం హృతిక్ రోషన్ కసరత్తు సాగిస్తున్నాడు. జిమ్‌లో చెమటోడుస్తూ కఠిన ఆహార నియంత్రణలు పాటిస్తున్నాడు.
ఇది హృతిక్ 25వ సినిమా కూడా కావడంతో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు మేకర్లు శ్రమిస్తున్నారు. ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను తెరకెక్కించున్నారు. గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌ను తనదైన శైలిలో పండించేందుకు హృతిక్ సంసిద్ధమవుతున్నాడని బాడీలాంగ్వేజ్, డిక్షన్, లుక్ పరంగా మేకోవర్ కోసం కసరత్తు సాగిస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా పేరు ఖరారు కాని విక్రమ్ వేధ హిందీ రీమేక్ షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుందని సమాచారం.