Hrithik Roshan | ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. ఈ సంగతి ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌పై పోస్ట్ చేశారు. ఈ మేరకు తన నడుముకు బెల్ట్ పెట్టుకున్ని క్రచెస్ మద్దతుతో నిలుచున్న ఫోటోను షేర్ చేశారు. `మీలో ఎంత మందికి క్రచెస్, వీల్ ఛైర్ అవసరమొచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?` అని పోస్ట్ చేశారు. తనను తాను మోటివేట్ చేసుకుంటున్నానని, ఆ బాధ నుంచి కోలుకుంటున్నానని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సినీ ప్రముఖులు టైగర్ షరాఫ్, వరుణ్ ధావన్, వాణీ కపూర్ తదితులు, ఫ్యాన్స్. నెటిజన్లు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలికి గాయం కావడంతో ఆయన రెస్ట్ తీసుకుంటారని, తత్ఫలితంగా వార్-2 సినిమా చిత్రీకరణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియా తెలిపింది.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటన వెలువడగానే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ క్యారక్టర్లో నటిస్తారని తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.