Hrithik Roshan | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జైలర్ 2’పై మరో సంచలన వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సీక్వెల్లో ఓ పవర్ఫుల్ క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మరింత ఆసక్తి పెరిగింది.తమిళ సినీ వర్గాల కథనాల ప్రకారం.. మొదట ఈ ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారట. అయితే ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘కింగ్’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ బిజీగా ఉండటంతో ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మేకర్స్ దృష్టి హృతిక్ రోషన్‌పై పడినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక ‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలన విజయం తెలిసిందే. రజనీకాంత్ కెరీర్లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ చూపించిన మాస్ అవతార్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే కథను కొనసాగిస్తూ ‘జైలర్ 2’ తెరకెక్కుతోందని సమాచారం. ఈ సీక్వెల్లో కూడా భారీ తారాగణమే కనిపించబోతోందని తెలుస్తోంది. రజనీకాంత్‌తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. మొదటి భాగంలో తమ క్యామియోలతో థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈసారి తమ పాత్రలను కొనసాగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘జైలర్ 2’ను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై తెరకెక్కనున్న ‘తలైవర్ 173’లో కూడా ఆయన నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మొదట సుందర్ సి పేరు వినిపించినా, తర్వాత సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశముందని టాక్ నడుస్తోంది. మరోవైపు రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. ప్రస్తుతం KHxRK పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.