Hostel Hudugaru Bekagiddare | తెలుగులోకి కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
Hostel Hudugaru Bekagiddare Movie | కన్నడలో కోట్లు కొల్లగొట్టిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే సినిమాను తెలుగులో రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మూడువారాల కిందట కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ భీభత్సమైన వసూళ్లు సాధించింది.
Hostel Hudugaru Bekagiddare Movie | గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ ఇలా కంటెంట్ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో మరో సినిమా తెలుగులో సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతుంది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. మూడువారాల కిందట కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ భీభత్సమైన వసూళ్లు సాధించింది.
ఇప్పుడీ సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్డూడీయోస్, చాయ్ బిస్కెట్ సంస్థలు సమర్పిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న తెలుగులో విడుదల కానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. హాస్టల్ రూంలో ఉండే ఐదుగురు స్టూడెంట్ కుర్రాళ్ళలో ఒకరికి షార్ట్ ఫిలిం తీయాలని ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ ఉండటంతో వాళ్ల ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టమంటారు. ఆ తర్వాత ఓ రోజును హఠాత్తుగా హాస్టల్లో వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ ఐదుగురు పేర్లు రాసిన సూసైడ్ నోట్ కనిపిస్తుంది.
దీంతో ఆ గండం నుంచి బయటపడేందుకు అదే హాస్టల్లో ఉన్న సీనియర్ సహాయం కోరుతారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమా కథాంశం. ఓ వైపు ట్విస్ట్‌లతో షాకిస్తూనే.. మరోవైపు ఆ ట్విస్ట్‌లలో జెనరేట్ అయ్యే కామెడీతో కడుపుబ్బా నవ్వుకుంటారు. తొలిరోజు కోటీ షేర్ కూడా రాని ఈ సినిమా మౌత్ టాక్ పాజిటీవ్ రావడంతో కలెక్షన్ల వరద పారుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
Doomsday | ఈ నెల 13న యుగాంతం.. ప్రపంచం అంతం కాబోతోందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల జోస్యం మళ్లీ వైరల్!
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

