Hostel Hudugaru Bekagiddare | సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ సినిమా
Hostel Hudugaru Bekagiddare Movie | గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది.
Hostel Hudugaru Bekagiddare Movie | గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ ఇలా కంటెంట్ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో మరో సినిమా కన్నడనాట సంచలన సృష్టిస్తుంది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా.
గత శుక్రవారం కన్నడలో రిలీజైన ఈ సినిమా ఇక్కడ బేబీ మాదిరిగానే కన్నడలో భీభత్సమైన వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించిన రిషబ్ శెట్టి తప్పితే పేరున్న నటుడే లేడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. హాస్టల్ రూంలో ఉండే ఐదుగురు స్టూడెంట్ కుర్రాళ్ళలో ఒకరికి షార్ట్ ఫిలిం తీయాలని ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ ఉండటంతో వాళ్ల ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టమంటారు. ఆ తర్వాత ఓ రోజును హఠాత్తుగా హాస్టల్లో వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ ఐదుగురు పేర్లు రాసిన సూసైడ్ నోట్ కనిపిస్తుంది. దీంతో ఆ గండం నుంచి బయటపడేందుకు అదే హాస్టల్లో ఉన్న సీనియర్ సహాయం కోరుతారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమా కథాంశం.
ఓ వైపు ట్విస్ట్‌లతో షాకిస్తూనే.. మరోవైపు ఆ ట్విస్ట్‌లలో జెనరేట్ అయ్యే కామెడీతో కడుపుబ్బా నవ్వుకుంటారు. మనకు ఈ నగరానికి ఏమైంది ఎలాగో.. కన్నడలో హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. అయితే దీనికి క్రైమ్ కామెడీని ఎంటర్టైనమెంట్స్ డోస్ పెంచారు. తొలిరోజు కోటీ షేర్ కూడా రాని ఈ సినిమా మౌత్ టాక్ పాజిటీవ్ రావడంతో కలెక్షన్ల వరద పారుతుంది. ఐదో రోజు ఏకంగా కోటిన్నర షేర్‌ను సాధించి వీర లెవల్లో దూసుకుపోతుంది. రేపో మాపో ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయడం మాత్రం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

