Priyanka Chopra | నెట్టింట ప్రియాంకా చోప్రా సెల్ఫీలు హల్ చల్
జై గంగాజల్ సినిమా తర్వాత హాలీవుడ్ (Hollywood) సినిమాలపైనే ఫోకస్ పెట్టింది బాలీవుడ్ (Bollywood) తార ప్రియాంకచోప్రా (Priyanka Chopra) .

2016లో వచ్చిన జై గంగాజల్ సినిమా తర్వాత హాలీవుడ్ (Hollywood) సినిమాలపైనే ఫోకస్ పెట్టింది బాలీవుడ్ (Bollywood) తార ప్రియాంకచోప్రా (Priyanka Chopra) . నిక్ జోనాస్ ను పెండ్లి చేసుకున్న తర్వాత యూఎస్‌కే పరిమితపోయింది. ప్రస్తుతం చేతినిండా హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం డ్రామా సిరీస్ గా వస్తున్న ‘సిటడెల్’ లో నటిస్తోంది. పాట్రిక్ మోరన్, రుస్సో బ్రదర్స్ సంయుక్తంగా ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రీమియర్ కానుంది. రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుస్సీ, రోలాండ్ మొల్లర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా ఈ ప్రాజెక్టులో ప్రియాంకాతో కలిసి కనిపించబోతున్నట్టు టాక్.
అయితే ప్రియాంకా చోప్రా లండన్ లో సిటడెల్ షూటింగ్ నుంచి శుక్రవారం విశ్రాంతి తీసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని సెల్ఫీలు (selfies) పోస్ట్ చేయగా..నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వెంట్రుకలు తన ఫొటోలను ఎలా డామినేట్ చేస్తున్నాయో చూపిస్తూ ఓ స్టిల్ ను పోస్ట్ చేసింది. ‘మీ సెల్ఫీలో 90 శాతం వెంట్రుకలే ఉంటే..’అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంకా. దీనికి వీజే అనూష స్పందిస్తూ..’అందంగా ఉన్నావ్’ అంటూ కామెంట్ పెట్టింది. ‘నాకు ఇష్టమైన వ్యక్తి ఓ మై గాడ్’ అంటూ వీరాభిమాని ఒకరు కామెంట్ పోస్ట్ చేశారు.
ఇటీవలే తన భర్త నిక్ జోనస్ 29వ పుట్టినరోజు గ్రాండ్ గా జరిపింది ప్రియాంకా చోప్రా. ‘నా జీవితంలోని ప్రేమ. నాకు తెలిసిన అత్యంత దయగల, ప్రేమ కలిగిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఐ లవ్ యూ బేబి’ అంటూ భర్త నిక్ జోనస్ ను విష్ చేసింది ప్రియాంకా చోప్రా. యెల్లోడ్రెస్ లో ఉన్న సతీమణి ప్రియాంకకు ముద్దు పెడుతున్న స్టిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


ఇవి కూడా చదవండి..
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

