ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్న అల్లు శిరీష్

గుమ్మడికాయ్ అంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా ఆవకాయ్ అంత అదృష్టం లేక విజయం కోసం అల్లాడిపోతున్న హీరో అల్లు శిరీష్. అన్న సూపర్ స్టార్ అయినా కూడా తమ్ముడు మాత్రం నార్మల్ హీరో కూడా కాలేకపోయాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు లాంటి ఒకట్రెండు సినిమాలు పర్లేదు అనిపించినా కూడా శిరీష్ కు మాత్రం ఇప్పటి వరకు కోరుకున్న ఇమేజ్ రాలేదు. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వస్తున్న సినిమా ప్రేమ కాదంట. ఈ సినిమా పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో మాయ చేసేలా కనిపిస్తున్నాడు ఈ హీరో. దీనికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. అల్లు శిరీష్ అప్ కమింగ్ సినిమా ప్రేమ కాదంట ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ముఖ్యంగా ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. లావణ్య త్రిపాఠి నుంచి మొదలుకొని సాయి ధరమ్ తేజ్ పలువురు హీరో హీరోయిన్లు ఈ సినిమా పోస్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లవ్లీ పోస్టర్ అంటూ లావణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఈ ఏడాది నీకు బ్లాక్ బస్టర్ పక్కా అంటూ సాయి ధరమ్ తేజ్ కూడా విష్ చేశాడు. కేవలం వీళ్లు మాత్రమే కాకుండా కుర్ర హీరో నిఖిల్, సందీప్ కిషన్, ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, కమెడియన్ వెన్నెల కిషోర్, రైటర్ గోపీమోహన్, హీరో కళ్యాణ్ దేవ్.. వీళ్లంతా ప్రేమ కాదంట పోస్టర్ గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. పోస్టర్ అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో ప్రమోట్ చేశారు.
దాంతో పాటు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి అల్లు శిరీష్ ను అభినందించారు. టాలీవుడ్ ప్రముఖుల నుంచే కాకుండా ట్రేడ్ అనలిస్టులు, జర్నలిస్టులు, టీవీ షో పోస్టుల దగ్గర నుంచి కూడా ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమిళ టీవీ యాంకర్లు దివ్యదర్శిని, నీలకందన్ ప్రేమ కాదంట పోస్టర్ గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అలాగే ఇతర ఇండస్ట్రీ నిర్మాతలైన మహేంద్ర సోనీ కూడా ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు శిరీష్, అను ఎమ్మాన్యూయేల్ జోడి చాలా బాగుంది అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- allu sirish
- prema kadanta
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

