Nayanatara-VIgnesh shivan Marriage date | కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే నయనతార నటించిన ‘కతువాకుల రెండు కాదల్’ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ జంట శ్రీవారిని దర్శించుకుంది. లేటెస్ట్ విఘ్నేష్ తిరుమలలో నయనతారతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈమె తెలుగులో మెగాస్టార్‌తో కలిసి ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో నటిస్తుంది. హిందీలో అట్లీ-షారుఖ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. వీటితో పాటుగా తమిళంలో రెండు సినిమాలు మలయాళంలో ఒక సినిమాలో నటిస్తుంది. ఇక విఘ్నేష్ శివన్ అజిత్‌తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
;