ప్రపంచ సినిమాకు మకుటాయమానంగా భావించే ఆస్కార్ పురస్కారాల వేడుకకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో లాస్ఏంజిల్స్లో ఉన్న అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నాటు నాటు’ పాట తాలూకు విశేషాల్ని పంచుకున్నారు ఎన్టీఆర్. ఆయన మాట్లాడుతూ “నాటు నాటు’ పాటలో ఇద్దరం కలిసి ఒకే సింక్‌లో డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది.
షూటింగ్‌కు ముందు ప్రతి రోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఈ పాట కోసం చాలా టేక్‌లు తీసుకున్నాం. ఇద్దరి డ్యాన్స్ ఒకే సింక్‌లో వచ్చే క్రమంలో టేక్‌లు తీసుకోవాల్సి వచ్చేది. సినిమా విడుదలయ్యాక మా ఇద్దరి డ్యాన్స్ మధ్య సింక్ బాగా కుదిరిందని అందరూ ప్రశంసించారు’ అ న్నారు. ఆస్కార్ వేడుక కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, తన వస్త్రధారణలో భారతీయత కనిపించేలా ప్రయత్నిస్తానని ఎన్టీఆర్ చెప్పారు.