నాకు చాలా ఇష్టమైన కథ
“బుట్టబొమ్మ’ చిత్రంలో నేను నటించాల్సి ఉంది. డేట్స్ సమస్య వల్ల కుదరలేదు. నాకు చాలా ఇష్టమైన కథ ఇది. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది. నిర్మాత వంశీగారితో నేను చేయబోయే సినిమాను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు యువ హీరో విశ్వక్సేన్.
“బుట్టబొమ్మ’ చిత్రంలో నేను నటించాల్సి ఉంది. డేట్స్ సమస్య వల్ల కుదరలేదు. నాకు చాలా ఇష్టమైన కథ ఇది. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది. నిర్మాత వంశీగారితో నేను చేయబోయే సినిమాను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు యువ హీరో విశ్వక్సేన్. శనివారం ‘బుట్టబొమ్మ’ ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. అనిఖా సురేంద్రన్, సూర్యవశిష్ట, అర్జున్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ద్వారా శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఫిబ్రవరి 4న విడుదలకానుంది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘పల్లెటూరి నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. అనూహ్యమైన మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది. హృదయాన్ని తడిమే భావోద్వేగాలుంటాయి. విశ్వక్సేన్తో మా సంస్థ ఓ సినిమా చేయబోతున్నది. అందులో ఆయన విశ్వరూపం చూస్తారు’ అన్నారు. కథానాయికగా తనకిది తొలి చిత్రమని, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని అనిఖా సురేంద్రన్ పేర్కొంది. సూర్యవశిష్ట మాట్లాడుతూ ‘ప్రేమకథతో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్‌ను పంచుతాయి. నా కెరీర్లో గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

