మధురమైన టీనేజ్ ప్రేమకథ
‘12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్‌గా వర్క్‌చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు ‘మధురం’ చిత్రంతో హీరోగా మారా.’ అంటున్నారు యువ నటుడు ఉదయ్‌రాజ్.
‘12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్‌గా వర్క్‌చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు ‘మధురం’ చిత్రంతో హీరోగా మారా.’ అంటున్నారు యువ నటుడు ఉదయ్‌రాజ్. ఆయన హీరోగా పరిచయమవుతున్న టీనేజ్ లవ్‌స్టోరీ ‘మధురం’. ‘ఎ మెమొరబుల్ లవ్’ అనేది ఉపశీర్షిక. వైష్ణవిసింగ్ కథానాయిక. రాజేష్ చికిలే దర్శకుడు. ఎం బంగార్రాజు నిర్మాత. శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఉదయ్‌రాజ్ మీడియాతో ముచ్చటించారు. ‘దర్శకుడు రాజేష్ చికిలేతో నాకెప్పట్నుంచో పరిచయం. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. 90ల్లో జరిగే కథ ఇది. 10వ తరగతి అమ్మాయి మధు, 9వ తరగతి అబ్బాయి రామ్‌ల మధ్య నడిచే ప్రేమకథ. ఇందులో చిన్నపిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తా. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశా.
ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగేవాడ్ని. నేను చదువుకుంది జెడ్పీహెచ్ స్కూల్లోనే. అప్పటి రోజుల్ని గుర్తు చేసేలా దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారు.’ అని తెలిపారు. కథానాయిక వైష్ణవిసింగ్ చక్కగా నటించిందని, నటుడిగా కొనసాగడం తనకు ముఖ్యమని, కేవలం హీరోగానే కాకుండా, ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తామంతా కొత్తవాళ్లమైనా ధైర్యం చేసి బంగార్రాజు చిత్రాన్ని నిర్మించారని, వి.వి.వినాయక్, విశ్వక్సేన్ లాంటి సినీ ప్రముఖులు ప్రమోషన్ విషయంలో సహకరించారని ఉదయ్‌రాజ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

