పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వి.యస్.ముఖేష్ దర్శకుడు. అఖిలేష్ కలారు నిర్మాత. ఇటీవల ఈ సినిమా టైటిల్ను పోస్టర్ను హీరో శివాజీ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఫ్యామిలీ, లవ్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేశాం. ఆద్యంతం నవ్వుల్ని పంచుతూ సాగుతుంది’ అన్నారు.
ఫ్యామిలీ సెంటిమెంట్ పాటు ప్రేమకథలోని కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేంద్ర చిలుముల, సంగీతం: మిష్టర్ జో, నిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్, రచన-దర్శకత్వం: వి.యస్.ముఖేష్.