హీరో శర్వానంద్‌కు కారు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఫిలింనగర్ కూడలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. కారు కొద్దిగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
పోలీసులు శర్వానంద్ కారు డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసి అతను మద్యం సేవించలేదని తేల్చారు. ఈ ఘటనపై శర్వానంద్ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ…‘ఈ ఉదయం నా కారుకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాకు ఎలాంటి గాయాలు కాలేదు. మీ ప్రేమాభిమానాలతో నేను క్షేమంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.