‘లవ్భూమ్, 7 టు 4, చిత్రం ఎక్స్ సినిమాల కథానాయకుడు రాజ్ బాల నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. జాక్ దర్శకుడు. కమలాకర రావు, కిషోర్ నిర్మాతలు. నలభై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. హీరో రాజ్‌బాల మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర డిఫరెంట్‌గా వుంటుంది. కాలకేయ ప్రభాకర్ పాత్ర కూడా ఎంతో భిన్నంగా వుంటుంది. మంచి కమర్షియల్ కంటెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నాకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువస్తుంది. ఇదికాక సుడిగాలి సుధీర్ చిత్రంతో పాటు, కన్నడలో ఓ సినిమా, బృహన్నల పేరుతో తెలుగు, హిందీ,తమిళంలో రూపొందిస్తున్న సినిమాల్లో నటిస్తున్నాను’ అన్నారు.