Hero movie in OTT | సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. బంగార్రాజు, రౌడిబాయ్స్ వంటి చిత్రాలు పోటిగా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లకు దెబ్బపడింది. ఈ చిత్రం విడుదలైన మూడువారాల్లోపే ఓటీటీలో విడుదలకానుంది.తాజాగా ఈ చిత్ర డిజిటల్ రీలీజ్ ఫిబ్రవరి11 న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ లో విడుదలకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది.