హీరో కార్తికేయని గెంటేసిన బౌన్సర్..!

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా కంటే ముందు రెండు సినిమాలు చేసాడు కార్తికేయ. ఫైనల్ సెటిల్మెంట్ అనే సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా కూడా చేసాడు. అప్పట్లో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఆర్ఎక్స్ 100 సినిమా చేసాడు. ఇదిలా ఉంటే ఓ దర్శకుడిని కలవడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లిన కార్తికేయను ఆయన బౌన్సర్స్ అవతలికి లాగి పడేసారు. ఈ ఘటన జరిగి ఏడేళ్ళవుతుంది. అప్పట్లో కార్తికేయ ఇంకా హీరో కాలేదు. అప్పుడే చదువు పూర్తి చేసుకుని సినిమాల వైపు వస్తున్నాడు.. అవకాశాల కోసం చూస్తున్నాడు.
అలాంటి సమయంలో కార్తికేయకు ఎదురైన చేదు ఘటన ఇది. అప్పట్లో ఛాన్సుల కోసం చూస్తున్నపుడు ఎవరో చెప్తే పూరీ జగన్నాథ్ ను కలవడానికి వెళ్లాడు కార్తికేయ. ఓ సారి కలిసాడు కూడా. ఆ తర్వాత ఆయన ఆఫీస్ కు వెళ్తే గంటల కొద్దీ వేచి చూడటం తప్ప లాభం లేకుండా పోయింది. అలాంటి సమయంలో షూటింగ్ స్పాట్ కు వెళ్తే కచ్చితంగా కలుస్తాడని అక్కడికి వెళ్లాడు కార్తికేయ. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరీ. దాంతో అక్కడికి వెళ్లిపోయాడు.. దూరం నుంచి పూరీని చూసి గట్టిగా అరిచాడు కూడా. ఇదంతా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అయితే అప్పుడు తాను కలిసిన సంగతి పూరీకి అస్సలు గుర్తు లేదని చెప్పుకొచ్చాడు. అయినా ఆయన సెలబ్రిటీ అయినపుడు తనతో ఫోటో దిగిన సంగతి ఆయనెందుకు గుర్తు పెట్టుకుంటాడు మన పిచ్చి గానూ అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.
టెంపర్ షూటింగ్ స్పాట్ కు వెళ్లిన కార్తికేయను అక్కడ పూరీ బౌన్సర్స్ పక్కకు లాగేయడమే కాకుండా తోసేసారని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత పూరీ ఆ విషయాన్ని గమనించి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారని చెప్పుకొచ్చాడు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు.. ఏమైనా ఉంటే చెప్తానని చెప్పాడని తెలిపాడు కార్తికేయ. ఇదంతా హీరో కాకముందు జరిగిందని.. హీరో అయిన తర్వాత ఆయన్ని కలిసినపుడు ఇవన్నీ చెప్పి నవ్వుకున్నామని గుర్తు చేసుకున్నాడు ఆర్ఎక్స్ 100 హీరో.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

