Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ చెన్నైలో పర్యటిస్తున్నారు. అయితే కోలీవుడ్‌కు చెందిన గలాట్టా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ 2024 (Galatta Golden Star Awards) శుక్రవారం జరుగగా.. ఈ వేడుకకు తమిళ హీరో కార్తీతో పాటు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు. అయితే ఈ ముగ్గురు వేదికపై రాగా సందీప్ మాట్లాడుతూ.. కార్తీ విజయ్‌తో డ్యాన్స్ చేయించబోతున్నాడు అంటూ రౌడీ హీరోను బుక్ చేశాడు. దీంతో చేసేదేమి లేక.. కార్తీతో కాలు కలిపాడు విజయ్. కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలోని పాటతో పాటు, ఆవారాలోని అరెరే వాన పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hero @Karthi_Offl Dances with @TheDeverakonda In Galatta Golden Stars 2024. ❤️🔥💥#Karthi #VijayDeverakonda
— Suresh PRO (@SureshPRO_) March 29, 2024