Highest Pre release business movies | ఒకప్పుడు తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటితే అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియన్ సినిమాల స్థాయికి జరగడంతో బిజినెస్ కూడా అలాగే పెరిగింది. తాజాగా ప్రభాస్ రాదే శ్యామ్ సినిమాకు 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరుసగా మూడోసారి తన సినిమా బిజినెస్ 200 కోట్లు దాటించాడు ప్రభాస్. మరి టాప్ 10 టాలీవుడ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు ఏంటో చూద్దాం..
1. బాహుబలి 2: 352 కోట్లు
2. సాహో: 270 కోట్లు
3. రాధే శ్యామ్: 202 కోట్లు
4. సైరా: 187 కోట్లు
5. పుష్ప: 144 కోట్లు
6. స్పైడర్: 124.8 కోట్లు
7. అజ్ఞాతవాసి: 124.6 కోట్లు
8. బాహుబలి: 118 కోట్లు
9. భీమ్లా నాయక్: 106.5 కోట్లు
10. మహర్షి: 100 కోట్లు