akshay kumar suryavanshi | ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో సినిమా విడుదలైతే తొలి మూడు రోజులు సంచలన కలెక్షన్స్ వచ్చేవి. ఫలితంతో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ అదిరిపోయేవి. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా వందల కోట్ల వసూళ్లు తీసుకొచ్చాయి. కానీ ఇదంతా గతం. కరోనా వైరస్ వచ్చిన తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా చేతులెత్తేసింది. అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఒకప్పుడు రెండు రోజుల్లో 100 కోట్లు తీసుకొచ్చిన హీరోలు.. గత రెండేళ్లుగా 50 కోట్ల వసూళ్లు సాధించడానికి నానా తిప్పలు పడుతున్నారు. బాలీవుడ్ సినిమాలకు ఆయువుపట్టుగా ఉండే మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూత పడటంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో విడుదలైన అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా ఇప్పుడు సంచలన వసూళ్ళు తీసుకొస్తుంది.
సూర్యవంశీ ( akshay kumar suryavanshi ) సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసిన తర్వాత నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 60 కోట్లు వసూలు చేసింది అక్షయ్ కుమార్ సినిమా. మూడో రోజు 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అయిపోయింది. బాలీవుడ్ సినిమాలు వంద కోట్ల మాట విని చాలా రోజులు అయిపోయింది. ఇలాంటి తరుణంలో వచ్చిన అక్షయ్ సినిమా అద్భుతమైన వసూళ్లు తీసుకు వస్తూ ఉండటంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. రాబోయే సినిమాలకు ఇది ఊపిరి అవుతుందని వాళ్లు భావిస్తున్నారు.
రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్య వంశీ 2020 లోనే విడుదల కావాలి. అయితే వైరస్ కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాదిన్నర పాటు వాయిదా పడుతూ వచ్చింది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించగా కత్రినా కైఫ్ హీరోయిన్. అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరిశారు. మరోసారి రొటీన్ కథతోనే వచ్చినా కూడా కమర్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. 1993 బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించాడు రోహిత్ శెట్టి. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా. సూర్యవంశీ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం అత్యుత్తమ పురస్కారం..
ఓటీటీలోకి వచ్చేస్తున్న పెళ్లి సందD చిత్రం…!
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
పుష్పలో సునీల్ పోస్టర్ జస్ట్ టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..
కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెంపుడు కుక్కలు..
ఫిజిక్‌పై ఫోకస్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్‌కు వచ్చేదప్పుడే..!