Mario | కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించింది హెబ్బాపటేల్. ఈ మూవీ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకుంది. ఈ భామ నటిస్తోన్న ప్రాజెక్ట్ మారియో. ‘ఏ టర్బో చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో అనిరుధ్ హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణ్ జీ గోగణ డైరెక్షన్లో వస్త్నో ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మారియో చిత్రాన్ని వచ్చే నెలలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది హెబ్బా పటేల్ టీం. మారియో కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. రాకేందు మౌళి పాటలు, మాటలు కూడా సమకూరుస్తున్నారు.
యాక్షన్ ప్యాక్డ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీకి అద్దం పట్టేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. రెడ్ డ్రెస్‌లో హెబ్బా పటేల్, రైఫిల్ పట్టుకొని అనిరుధ్ హై ఓల్టేజ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్‌గా పక్కా వినోదాన్ని అందించేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు