Amen Movie | భయపెట్టడానికి వస్తున్న ‘ఆమెన్’.. టాలీవుడ్లో సరికొత్త హారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనున్న దర్శకుడు ఎస్కే బషీద్!
Amen Movie | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలతో, విభిన్నమైన ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్.
Amen Movie | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలతో, విభిన్నమైన ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్. ఎన్నో భాషల్లో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా మరెవ్వరూ ఊహించని సరికొత్త కథాంశంతో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ నేతృత్వంలో నిర్మించిన అల్టిమేట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆమెన్’ (AMEN) వచ్చే జూలై 24న అత్యంత భారీస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా గురించిన విశేషాలను పంచుకుంటూ దర్శకుడు ఎస్కే బషీద్ ఒక సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో హారర్ సినిమాలు వచ్చినప్పటికీ ‘ఆమెన్’ చిత్రం వాటన్నింటికీ భిన్నంగా, సరికొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం భయం మాత్రమే కాకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, ఊపిరి సలపనివ్వని ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే “గుండె జబ్బులు ఉన్నవారు దయచేసి ఈ సినిమాకు రావద్దు” అంటూ ఆయన సంచలన హెచ్చరిక జారీ చేశారు. థియేటర్లలో ఒంటరిగా కూర్చుని ఈ సినిమాను వీక్షించే ధైర్యం ఎవరూ చేయలేరని, ఇది ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసే ఒక అపూర్వమైన భయానక అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. సరికొత్త తారాగణంతో విజువల్ వండర్లా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై నమ్మకంతో తామే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు బషీద్ స్పష్టం చేశారు.
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విడుదలైన ‘ఆమెన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా “మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి” అంటూ పోస్టర్‌పై ముద్రించిన క్యాప్షన్ హారర్ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. క్రూసేడర్ థీమ్‌కు తోడు, నీటి లోపలి నుండి భయానకంగా పైకి లేస్తున్న వింత హస్తాలు సినిమాలోని అసలు మిస్టరీని మరియు సస్పెన్స్‌ను చెప్పకనే చెబుతున్నాయి. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను కూడా ఒక భారీ ఈవెంట్ ద్వారా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు అశోక్ దయ్యాల పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ ప్రకంపనలు సృష్టించేందుకు జూలై 24న థియేటర్లలో ల్యాండ్ కాబోతున్న ఈ భయంకర దృశ్యకావ్యం ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

