అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అన్వేష్ వారాల ‘అపార్’
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్' లఘుచిత్రం ఎంపికైనట్లు ఆ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్ అన్వేష్ వారాల తెలిపారు. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపార్ సెలెక్ట్ కావడం సంతోషంగా ఉన్నదన్నారు.
కమాన్‌చౌరస్తా, సెప్టెంబరు 16 : అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్’ లఘుచిత్రం ఎంపికైనట్లు ఆ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్ అన్వేష్ వారాల తెలిపారు. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపార్ సెలెక్ట్ కావడం సంతోషంగా ఉన్నదన్నారు. తొలుత కేరళలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవియానిక్స్ చదివిన అన్వేష్ ఉద్యోగాన్ని కాదనుకున్నాడు.
సినిమాలపై ఆసక్తి మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ పీజీ కోర్సు ఆఫ్ సినిమాటోగ్రఫీ పూర్తి చేశాడు. ఇనిస్టిట్యూట్‌లో నిర్మించిన ‘అపార్’ ఉత్తరప్రదేశ్‌లో జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికకాగా, బరేలీ, వారణాసి వంటి నగరాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. తర్వాత బెంగళూరులో నిర్వహించే బెంగుళూరు క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.
ఈ ఫెస్ట్‌లో అనేక అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో 28వ అంతర్జాతీయ కోల్కత్తా ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అధికారిక ఎంట్రీగా ప్రదర్శించారు. 15 నిమిషాల నిడివి గల ఈ అపార్ షార్ట్ ఫిల్మ్ లెస్బియన్ల సమస్య మీద రూపొందించారు. లఘు చిత్రంలో మధ్యమ హల్దార్, రాజా చక్రవర్తి, అర్పితా డే తదితరులు నటించగా, ఆబిసోన్ యమ్నం దర్శకత్వం వహించారు. కథ, కథనం శృతి పార్ధ సారథి, ఎడిటింగ్ అంకిత్ ప్రకాశ్, ఆర్ట్ స్వరాజ్ సిద్ధార్థ్, నిర్మాణం ప్రథమేశ్ వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

