Hatya Movie On Ott | బిచ్చగాడు సిరీస్‌తో విజయ్‌కు తెలుగులో మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా బాగానే పెరిగింది. మూడు నెలలు ముందు రిలీజైన బిచ్చగాడు-2 ఇక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొట్టింది. అదే ఊపులో విజయ్ ఆంటోని హత్య సినిమాను రిలీజ్ చేశాడు. కానీ ఈ సారి బెడిసి కొట్టింది. కథ, కథనం ఇలా ప్రతీది లోపించడంతో సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ చేసే అంశాలు ఒక్కటి లేవనీ చూసిన పలువురు నెటీజన్లు రివ్యూలు ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. జూలై 21న రిలీజైన ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. లైలా (మీనాక్షి చౌదరి) ఒక ప్రొఫెషనల్ మోడల్, తన ఫ్లాట్‌లో హత్యకు గురవుతుంది. కొత్తగా డ్యూటిలోకి జాయిన్ అయిన IPS అధికారి సంధ్య మోహన్ రాజ్ (రితికా సింగ్) ఈ కేసును టేకప్ చేస్తుంది. సంధ్య డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోని) సహాయం కోరుతుంది. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి ఇంతకీ లైలాను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే కథనంతో ఈ సినిమా తెరకెక్కింది.