ఆనాటి ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ నుంచి, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఇరుముడి’ వరకూ గమనిస్తే.. రవితేజ సినిమా టైటిల్స్ చాలా వరకూ భిన్నంగా ఉంటాయి. టైటిల్ నుంచే సినిమాపై ఆసక్తిని రేకెత్తించడం రవితేజ ైస్టెల్. త్వరలో ఆయన నుంచి మరో వెరైటీ టైటిల్ రానున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. శ్రీవిష్ణుతో ‘రాజరాజ చోర’ లాంటి చిత్రాన్ని రూపొందించిన హసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్ని అనుకుంటున్నారట. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ పోషించిన అత్తిలి సత్తిబాబు పాత్ర చెప్పే డైలాగ్ నుంచే ఈ టైటిల్ పుట్టిందని ఇన్సైడ్ టాక్. రవితేజ మార్క్ కామెడీతో ఈ కథ సాగుతుందని సమాచారం. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజతో దిల్రాజు నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానున్నదట.