Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకి జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని, దీనికోసం పవన్ కల్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నారని వార్తలు వచ్చాయి. మూవీ ఈవెంట్‌కి రజనీకాంత్ గెస్ట్‌గా రానున్నట్టు కూడా ప్రచారం నడిచింది. కాని ఉన్నట్టుండి ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వాయిదా పడినట్టు ప్రచారం నడుస్తుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందున ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవ కథతో హరి హర వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఎక్కువగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఏర్పడింది. ఈ సినిమాకి సంబంధించి ఇరాన్, పలు ఇతర దేశాల్లో టెక్నికల్ వర్క్ జరుగుతున్నది. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు కాబట్టి హడావిడిగా చివరి నిమిషంలో సినిమాని విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతో మూవీ రిలీజ్ మరో సారి వాయిదా వేయాలని అనుకుంటున్నారట.
బయ్యర్స్ కూడా ఇంకా దొరకలేదనే టాక్ నడుస్తుంది. వర్క్ పూర్తి కాని నేపథ్యంలోనే మూవీ ట్రైలర్ కూడా ఇంకా విడుదల చేయలేదని అంటున్నారు. ఇన్నిసార్లు మూవీ వాయిదా పడడంతో అభిమానులు ఆశలు, ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టు అయింది. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. పురాణ బందిపోటు వీరుడి కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.