Hari Hara Veera Mallu | మార్చిలో వీరమల్లు ఆగమనం.. తెరకెక్కుతున్న పోరాట ఘట్టాలు
రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ నిచ్చారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్. ఏపీ ఉపముఖ్యమంత్రిగా పాలనాపరమైన వ్యవహారాల్లో తీరికలేకుండా ఉండటం వల్ల ఆయన సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. అయితే పవన్‌కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్తను అందించింది ‘హరిహరవీరమల్లు’ చిత్ర బృందం.
Hari Hara Veera Mallu | రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ నిచ్చారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్. ఏపీ ఉపముఖ్యమంత్రిగా పాలనాపరమైన వ్యవహారాల్లో తీరికలేకుండా ఉండటం వల్ల ఆయన సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. అయితే పవన్‌కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్తను అందించింది ‘హరిహరవీరమల్లు’ చిత్ర బృందం. సోమవారం ఈ సినిమా షూటింగ్‌ను విజయవాడలో పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇందులో పవన్‌కల్యాణ్‌తో పాటు చిత్ర తారాగణమంతా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్‌పావెల్ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
కళా దర్శకుడు తోట తరణి నేతృత్వంలో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. 400 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య నేపథ్య ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. ‘హరిహర వీరమల్లు పార్ట్-1స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్, నిర్మాత: ఏ.దయాకర్ రావు, సమర్పణ: ఏం.ఎం.రత్నం, దర్శకత్వం: జ్యోతికృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

