పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. టీజర్, ఫస్ట్‌లుక్‌లకు మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడం అభిమానుల్ని కాస్త కలవరపరుస్తున్నది. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారని ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత ఏ.ఎం.రత్నం ఇటీవలే వెల్లడించారు. ఇదిలావుండగా సెప్టెంబర్ 2న పవన్‌కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఓ ప్రత్యేకమైన టీజర్‌ను లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.