Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హరిహరవీరమల్లు సినిమా గురించి ఏఎం రత్నం మాట్లాడుతూ.. హరి హర వీర మల్లు ఇన్పుట్స్, అవుట్ఫుట్స్ గురించి నా కొడుకు జ్యోతి కృష్ణకు తెలుసు. అతడు ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు.
హాలీవుడ్లో కూడా చాలా మంది దర్శకులు ఒకే సినిమాకు పనిచేశారు. పవన్ కల్యాణ్, నేను కూడా గతంలో సినిమాలకు దర్శకత్వం వహించాము. ఈ ప్రాజెక్ట్‌ను అంత తేలికగా తీసుకోం. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. పవన్ కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని అవతార్‌లో హరిహరవీరమల్లులో కనిపించబోతున్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కెరీర్లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. హరిహరవీరమల్లు రెండు పార్టులుగా రాబోతుంది. హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను ఇప్పటికే రామోజీఫిలింసిటీలో చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ మరోవైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
పవన్ కల్యాణ్‌తో యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్..
ఓజీ గ్లింప్స్..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..