ఏడాది చివర్లో వీరమల్లు సందడి
హిస్టరీలో ఉన్న పాత్రలను తీసుకొని, వాటి చుట్టూ అల్లిన కల్పిత జానపద కథ ‘హరిహరవీరమల్లు’. ప్రకటన వచ్చిన నాటినుంచి పవన్‌కల్యాణ్ అభిమానులే కాక, యావత్ సినీప్రియులంతా ఆ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇందులో రాబిన్‌హుడ్ తరహా పాత్ర చేస్తుండటం విశేషం.
హిస్టరీలో ఉన్న పాత్రలను తీసుకొని, వాటి చుట్టూ అల్లిన కల్పిత జానపద కథ ‘హరిహరవీరమల్లు’. ప్రకటన వచ్చిన నాటినుంచి పవన్‌కల్యాణ్ అభిమానులే కాక, యావత్ సినీప్రియులంతా ఆ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇందులో రాబిన్‌హుడ్ తరహా పాత్ర చేస్తుండటం విశేషం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా మూడొంతులు షూటింగ్ పూర్తిచేసుకోగా, మిగతా షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రత్యేకంగా 17వ శతాబ్దం నాటి చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ నిర్మాణ విలువలతో రాజీ లేకుండా నిర్మించారు. తాజా అప్టేట్ ఏంటంటే..
ఈ సినిమాకు దర్శకుడు మారినట్టే, ఇప్పుడు డీవోపీ కూడా మారాడు. ఇప్పటివరకూ జ్ఞానశేఖర్ వి.ఎస్ ఛాయాగ్రహణం అందించగా, ఆయన స్థానంగా ఇప్పుడు మనోజ్ పరమహంస వచ్చి చేరారు. మిగతా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ లొకేషన్లు వెతికే పనిలో పడింది. మరోవైపు ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌కు సంబంధిచిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది చివరికల్లా ‘హరిహర వీరమల్లు పార్ట్1’ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ను విడుదల చేయడానికి టీమ్ సిద్ధమయింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, సునీల్, నోరా ఫతేహి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, సమర్పణ: ఏ.ఏం.రత్నం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

