Oh My God Movie | సంచలనాలు సృష్టిస్తున్న హర హర మహాదేవ్ సాంగ్
Har Har Mahadev Song | ఓ మై గాడ్-2 మూవీ నుంచి రిలీజైన హర హర మహాదేవ్ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. రెండు రోజులుగా ఏ మ్యూజిక్ ప్లాట్ఫార్మ్ చూసుకున్న ఇదే ట్రెండింగ్‌లో ఉంది.
Har Har Mahadev Song | తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ఓ మై గాడ్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రెండొందల కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాలగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఓమై గాడ్‌కు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటిక రిలీజైన పోస్టర్లు,టీజర్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.
కాగా ఈ సినిమా నుంచి రిలీజైన హర హర మహాదేవ్ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. రెండు రోజులుగా ఏ మ్యూజిక్ ప్లాట్ఫార్మ్ చూసుకున్న ఇదే ట్రెండింగ్‌లో ఉంది. విక్రమ్ మాన్ట్రోస్ స్వర పరిచి, ఆలపించిన ఈ పాటకు శేఖర్ అతిత్వ లిరిక్స్ అందించాడు. హర హర మహదేవ్ అంటూ మిక్స్ రాప్‌తో చెవుల్లో మార్మొగిపోతుంది. ముఖ్యంగా ఈ పాట వీడియో సాంగ్ చాలా రియలిస్టిక్‌గా తీశారు. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ అవుతున్న ఈ పాటను మీరు ఓ లుక్కేయండి.
వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

