యష్ పూరి, అపూర్వ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకుడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను యువ దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నాకు మన పురాణాలు అంటే చాలా ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు అందులో శాపాల గురించిన కథలు ఆసక్తిగా అనిపించాయి. అలాంటి ఓ శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది.
నేటి ట్రెండ్‌కు అనుగుణంగా న్యూఏజ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం’ అన్నారు. రొమాన్స్‌తో పాటు వినోదాత్మక అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని హీరో యష్‌పూరి తెలిపారు. కథలో ప్రతీ అంశం కొత్తగా అనిపిస్తుందని, యంగ్ టీమ్‌తో సినిమాను తెరకెక్కించామని నిర్మాత పేర్కొన్నారు. అజయ్‌ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్‌రోషన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి, సంగీతం: రవి నిడమర్తి, స్క్రీన్‌ప్లే: నాగ సాయి, నిర్మాతలు: యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, కథ, దర్శకత్వం: కౌశిక్ భీమిడి.