Paresh Rawal | విలక్షణ నటనకు C/O పరేష్ రావల్.. హ్యాపీ బర్త్ డే టు లింగం మామ
Paresh Rawal | విలక్షణ నటుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు బాలీవుడ్ (Bollywood)యాక్టర్ పరేష్ రావల్ (Paresh Rawal). సిల్వర్ స్క్రీన్‌పై విలక్షణ నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా వినోదాన్ని అందిస్తున్న పరేష్ రావల్ పుట్టినరోజు నేడు.
Paresh Rawal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో ఉన్న విలక్షణ నటుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు బాలీవుడ్ (Bollywood)యాక్టర్ పరేష్ రావల్ (Paresh Rawal). హిందీతోపాటు తెలుగు, తమిళం, గుజరాతీ భాషల్లో నటించిన పరేష్ రావల్ తన కెరీర్లో నేషనల్ అవార్డుతోపాటు ఎన్నో ఇతర పురస్కారాలను అందుకున్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై విలక్షణ నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా వినోదాన్ని అందిస్తున్న పరేష్ రావల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మూవీ లవర్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
పుట్టినరోజు సందర్భంగా పరేష్ రావల్ గురించి కొన్ని విశేషాలు..
ఈ టాలెంటెడ్ యాక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణక్షణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. ఆ తర్వాత తెలుగులో మనీ, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా..?, శంకర్ దాదా ఎంబీబీఎస్, తీన్మార్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. కామెడీ, సీరియస్, ఎమోషనల్.. ఇలా ఏ రోల్లోనైనా ఇట్టే ఒదిగిపోవడం పరేష్ రావల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ సీనియర్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డ్రీమ్ గర్ల్ 2తోపాటు సూరారై పోట్రు హిందీ రీమేక్, ది స్టోరీ టెల్లర్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
పరేష్ రావల్ క్షణక్షణంలో నాయర్‌గా, మనీలో సుబ్బారావుగా, గోవిందా గోవిందా చిత్రంలో పోషించిన పరేష్ పాత్రలను తెలుగు ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటారు. పరేష్ రావల్ ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో లింగం మామ (డాక్టర్ రామలింగేశ్వర్ రావు)గా ఓ వైపు తనదైన విలనిజాన్ని చూపిస్తూనే.. మరోవైపు పొట్టచెక్కలయ్యే కామెడీ స్టైల్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర ఆల్‌టైమ్ ఫేవరేట్ రోల్స్‌లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

