Sunny Leone | హ్యాపీ బర్త్ డే సన్నీ లియోన్.. ఈ భామ గురించి ఈ విషయాలు తెలుసా?
Sunny Leone | ఒకప్పుడు శృంగార తారగా యువతకి పరిచయం ఉన్న సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. నటిగా, డ్యాన్సర్‌గా అదరగొడుతుంది. సన్నీ లియోన్ వాస్తవానికి భారత మూలానున్న వ్యక్తని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు సన్నీ లియోన్ 44వ పడిలోకి అడుగుపెట్టింది.
Sunny Leone | ఒకప్పుడు శృంగార తారగా యువతకి పరిచయం ఉన్న సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. నటిగా, డ్యాన్సర్‌గా అదరగొడుతుంది. సన్నీ లియోన్ వాస్తవానికి భారత మూలానున్న వ్యక్తని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు సన్నీ లియోన్ 44వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొందరు సన్నీ లియోన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నీ లియోన్ బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించింది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్ . సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పేరును మార్చుకున్నారు.
2012లో ‘జిస్మ్ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్, ఈ చిత్రంతో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత 2013లోనటించిన ‘జాక్‌పాట్’ కూడా ప్లాప్ అయ్యింది. ఇక 2014లో రాగిణి MMS 2 లో నటించగా, ఈ హర్రర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అయితే, దీని వల్ల సన్నీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.ఆ తర్వాత సన్నీ లియోన్ ఐటెం సాంగ్స్‌లో నటించడం ప్రారంభించింది. అప్పుడు కొంత పేరు సంపాదించుకుంది.సన్నీ లియోన్ తన 12 సంవత్సరాల కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించినప్పటికీ చాలా వరకు, ఆమె కొన్ని నిమిషాలు మాత్రమే తెరపై కనిపించేది. అడల్ట్ మూవీస్‌లో తనతో నటించిన డేనియల్ వెబర్నే 2011లో పెళ్లాడింది సన్నీ.
పెళ్లై దశాబ్థకాలం పూర్తి చేసుకున్న సన్నీ లియోన్ పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత అక్టోబర్ 31, 2024న తన భర్తతో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. రెండోసారి తన భర్త డేనియల్ ని తిరిగి వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమం మాల్దీవుల్లో జరిగింది. ఈ వేడుకలో తన ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కూడా ఉన్నారు. వాస్తవానికి నిషాను ఈ జంట దత్తత తీసుకుంది. ముగ్గురు పిల్లల సమక్షంలో సన్నీ పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. రెండవ సారి భర్తను పెళ్లాడడంతో ఆమె ఫ్యామిలీకి ఇస్తున్న కమిట్మెంట్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ఇక సన్నీ ఒక్కో ఐటెం సాంగ్‌కి దాదాపు మూడు కోట్ల వరకు తీసుకుంటుందని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

