సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్నది. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే వందకోట్ల మైలురాయిని దాటింది. ఇక విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను దాటింది. అక్కడ
మొదటి వారాంతంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ రికార్డులను దాటేయడం విశేషం. అమెరికాలో లాంగ్న్‌ల్రో ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం అనూహ్య వసూళ్లతో సంక్రాంతి విజేతగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ తొలి ఒరిజినల్ సూపర్ హీరో ఫిల్మ్‌గా ‘హనుమాన్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోవు రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.