Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Teja Sajja | టాలీవుడ్ యంగ్ హీరో, 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వార్తను స్వయంగా ఆయనే ధృవీకరించారు. తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
Teja Sajja | టాలీవుడ్ యంగ్ హీరో, ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వార్తను స్వయంగా ఆయనే ధృవీకరించారు. తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన ఉదయ్‌పూర్‌లో ఈ ఏడాది డిసెంబర్లో తన వివాహం అత్యంత నిరాడంబరంగా జరగనుందని తేజ సజ్జ వెల్లడించారు.
ఈ వివాహం పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని తేజ స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులే ఈ సంబంధం నిశ్చయించారని తెలిపారు. డిసెంబర్లో జరగబోయే పెళ్లి వేడుకకు ముందు, నవంబర్ నెలలో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా కంటికి దూరంగా, అత్యంత గోప్యంగా ఉంచాలని కోరుకునే తేజ సజ్జ.. ఈ పెళ్లి వేడుకను కూడా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరపాలని నిర్ణయించుకున్నారు. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ముగిసిన తర్వాత, హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక ఘనమైన రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక తన కాబోయే భార్య గురించి చెబుతూ.. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజ వెల్లడించారు. ఆమె కుటుంబం టెక్నాలజీ రంగంలో వ్యాపారం చేస్తోందని, ఆమె కూడా తన తండ్రితో కలిసి అదే రంగంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఆమె అమెరికాలో పెరిగారని, సినిమా గ్లామర్ ప్రపంచానికి, లైమ్‌లైట్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారని తెలిపారు. సెలబ్రిటీ ప్రపంచానికి దూరంగా ఉండే ఆమె స్వభావమే తనకు బాగా నచ్చిందని, భవిష్యత్తులో కూడా ఆమె ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా చూసుకుంటానని తేజ సజ్జ పేర్కొన్నారు.
ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. ‘హనుమాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, ఆ తర్వాత ‘మిరాయ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ప్రముఖ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ తొలి సీజన్‌కు హోస్ట్ వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

