Lalo – Krishna Sada Sahayate | రూ.50 లక్షల బడ్జెట్‌తో రూ.100 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద గుజరాతీ సినిమా ప్రభంజనం!
Gujarati film | చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి.
Gujarati film | చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే అలాంటి అద్భుతాన్ని సృష్టించింది గుజరాతీ చిత్రం ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ (Lalo – Krishna Sada Sahayate). ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై అనుహ్య విజయాన్ని సాధించడమే కాకుండా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో గుజరాతీ సినిమాల బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. సినిమా కంటెంట్, కథనానికి ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ స్థాయిలో వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు అంకిట్ సఖియా (Ankit Sakhiya) దర్శకత్వం వహించగా.. జాతీయ అవార్డు గ్రహీత మానసి పరేఖ్ నిర్మాతగా వ్యవహరించాడు. కారన్ జోషి (Karan Joshi) ప్రధాన పాత్రలో నటించగా.. రీవా రాచ్ (Reeva Rachh) కథానాయికగా నటించింది. శ్రుహద్ గోస్వామి కీలక పాత్రల్లో నటించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్ర కథానాయకుడు (కారన్ జోషి) ఒక ఆటో డ్రైవర్. అతను ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంతేకాక గతంలో జరిగిన కొన్ని విషయాలు అతడిని వెంటాడుతుంటాయి, ఆ బాధ నుంచి అతను ఎప్పుడూ బయటపడలేకపోతుంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక రోజు ఆ ఆటో డ్రైవర్ ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. బయటికి రావడానికి అతను అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాదు. సరిగ్గా ఆ సమయంలోనే అతడికి మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు తన అద్భుతమైన లీలలు, మాటల ద్వారా ఆ ఆటో డ్రైవర్‌ను ముక్తి మార్గం వైపు నడిచేలా చేస్తాడు. శ్రీకృష్ణుడి అండదండలతో ఆ డ్రైవర్ తన గతం తాలూకూ బాధలు, తన మనసులోని అలజడిని అధిగమిస్తాడు. కొత్త ఆశలు, ధైర్యంతో జీవితంలో ముందుకు సాగడం ప్రారంభిస్తాడు. ఒక ఆటో డ్రైవర్ జీవితంలో దైవ శక్తి జోక్యం, భక్తి, స్నేహంతో అతను ఎలా మార్పు చెందాడు అనేదే ఈ ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ చిత్ర కథాంశం. ఈ భావోద్వేగపూరితమైన కథే సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

