Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Goutham Raju | తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం రాజు కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారనే వార్త వైరల్ కావడంతో తాజాగా గౌతం రాజు స్పందించారు.
Goutham Raju | తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం రాజు కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారనే వార్త వైరల్ కావడంతో తాజాగా గౌతం రాజు స్పందించారు. తన ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని గౌతం రాజు స్పష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటిస్తున్నానని వెల్లడించారు. తన గురించి ఓ సినిమా పత్రిక ఫేస్బుక్లో ప్రచురించిన కథనం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు.
ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని గౌతం రాజు పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహంతో పాటు ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నానని చెప్పారు. తనకు చెప్పుకోవడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయని, ‘ఘనరా మొగుడు’, ‘వినోదం’, ‘ప్రేమకు వేళయరా’ వంటి చిత్రాల్లో నటించానని గుర్తుచేశారు.తాను 200 సినిమాల్లో నటించినా చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదన్నట్లుగా సదరు పత్రికలో కథనం రాయడంపై గౌతం రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానంటూ ప్రచురించిన వార్త పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఆ పత్రికకు తాను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని తెలిపారు.
తన గురించి వచ్చిన వార్తను చూసి స్నేహితులు ఆందోళన చెందుతున్నారని గౌతం రాజు చెప్పారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని చూసి జాలిపడటమే కాకుండా, వీలైతే సహాయం చేయాలని అన్నారు. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై నిర్ధారణ లేని వార్తలు ప్రచారం చేయడం వల్ల తనతో పాటు తన సన్నిహితులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని గౌతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి తప్పుడు కథనాలు రాయకూడదని మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులను కోరారు. సదరు సినిమా పత్రిక ఎడిటర్ వెంటనే ఆ వార్తను తొలగించి, జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు.సినిమాల్లో కొంతకాలంగా తక్కువగా కనిపిస్తున్నంత మాత్రాన ఒక నటుడి ఆరోగ్యంపై నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

