అభినవ రామలక్ష్మణులు
గోపీచంద్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథానాయిక. గోపీచంద్ నటిస్తున్న 30వ చిత్రమిది.
గోపీచంద్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథానాయిక. గోపీచంద్ నటిస్తున్న 30వ చిత్రమిది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్, జగపతిబాబు పంచెకట్టులో సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు.
‘ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని కలిపితే నేను’ అనే సంభాషణతో రూపొందించిన వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు ప్రజా నాయకుడిగా కనిపిస్తాడని, ఆయనకు అండగా నిలిచే అనుచరుడిగా గోపీచంద్ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సందేశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళని స్వామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

