గోపీచంద్ సీటీమార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజు కూత అదిరింది..

seetimaarr first day collection | గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సీటీమార్. వినాయకచవితి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్‌గానే ఉందనే టాక్ వచ్చినా కూడా పక్కా మాస్ సినిమా కావడంతో ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. అన్ని చోట్ల బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఏపీలో కేవలం మూడు షోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నా.. కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఓవర్సీస్లో పరిస్థితుల ప్రభావంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు నిర్మాతలు. అయినా కూడా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రానటువంటి భారీ వసూళ్లు సీటీమార్ సాధించింది. బాలీవుడ్లో విడుదలైన సినిమాలకు కూడా సీటీమార్ రేంజ్ వసూళ్లు రాలేదు. స్పోర్ట్స్ డ్రామాకు సోషల్ ఇష్యూను ముడిపెడుతూ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఏరియా వైజ్ సీటీమార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

నైజాం: 0.91 కోట్లు
సీడెడ్: 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.30 కోట్లు
ఈస్ట్: 0.27 కోట్లు (6 లక్షలు హైర్స్)
వెస్ట్: 0.16 కోట్లు
గుంటూరు: 0.41 కోట్లు (11 లక్షలు హైర్స్)
కృష్ణా: 0.19 కోట్లు
నెల్లూరు: 0.19 కోట్లు (5 లక్షలు హైర్స్)
ఏపీ + తెలంగాణ: 2.98 కోట్లు షేర్ (4.75 కోట్ల గ్రాస్ + 22 లక్షలు హైర్స్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 0.14 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 3.16 కోట్లు షేర్
సీటీమార్ సినిమాకు రూ. 11.5 కోట్ల బిజినెస్ జరిగింది. గోపీచంద్ ప్రస్తుత మార్కెట్‌కు అది తక్కువే కానీ బయట పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బిజినెస్ చేశారు. కథ రొటీన్‌గానే ఉన్నా.. సంపత్ నంది స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. దాంతో కలెక్షన్స్ అదిరిపోయాయి. మాస్ సినిమాకు ఉన్న పవర్ ఏంటో మరోసారి చూపించింది సీటీమార్. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోవడంతో సినిమా రేంజ్ పెరిగింది. తమన్నా అందాలు సీటీమార్‌కు అదనపు ఆకర్షణ. తొలిరోజు రూ. 3.16 కోట్ల షేర్ వచ్చింది.. ఈ సినిమా సేఫ్ అవ్వడానికి మరో రూ. 8 కోట్లు రావాల్సి ఉంది. వీకెండ్ ఉండటంతో కలెక్షన్స్ కుమ్మేసేలా కనిపిస్తుంది సీటీమార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Saidharam Tej | స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Prabhas | ప్రభాస్‌తో గొడవపడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

