విప్లవాన్ని రగిలించే యోధుడు
హీరో గోపీచంద్ తన తాజా చిత్రంలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
హీరో గోపీచంద్ తన తాజా చిత్రంలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ‘గోపీచంద్33’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్నది. గురువారం గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మంచుతో కప్పబడిన పర్వతశ్రేణుల నడుమ మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. పొడవాటి జుట్టు, శరీరమంతా గాయాలు, నుదుటిన వీరతిలకం ధరించి యోధుడి పాత్రలో ఆయన కనిపించిన తీరు సర్ప్రైజింగ్గా ఉంది. 7వ శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, చరిత్ర మరిచిపోయిన ఓ అధ్యాయానికి జీవం పోసే చిత్రమిదని మేకర్స్ తెలిపారు.
‘అతనో యోధుడు. విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ చిత్రబృందం ఈ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్, రచన-దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

