Year Ender 2023 | ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో అత్యధిక వెతికింది ఈ సినిమాల గురించే!
Year Ender 2023 | ఇంకా కొద్దిరోజులే! మరో 20 రోజుల్లో పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పాత సంవత్సరంలో సంపాదించుకున్న మధురస్మృతులను నెమరేసుకుంటున్నారు.
Year Ender 2023 | ఇంకా కొద్దిరోజులే! మరో 20 రోజుల్లో పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పాత సంవత్సరంలో సంపాదించుకున్న మధురస్మృతులను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కూడా 2023 సంవత్సరంలో ఎవరెవరు ఏమేమీ వెతికారు? ఏ అంశాల గురించి సెర్చ్ చేశారనే విషయాలను వరుసగా వెల్లడిస్తున్నది. తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది.
ఈ ఏడాది షారుక్‌ఖాన్‌కు బాగా కలిసొచ్చింది. వరుసగా పఠాన్, జవాన్ సినిమాలో భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించాడు. బాలీవుడ్‌కు ఎప్పటికీ తానే బాద్షా అని నిరూపించుకున్నాడు. తాజాగా గూగుల్ విడుదల చేసిన టాప్-10 చిత్రాల జాబితా కూడా అదే వెల్లడించింది. అందుకే ఈ ఏడాది షారుక్ నటించిన రెండు సినిమాలు కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితోపాటు సైలెంట్‌గా విడుదలై సంచలనం సృష్టించిన గదర్-2, ది కేరళ ఫైల్స్ కూడా ఈ జాబితాలో నిలిచాయి.
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సల్మాన్‌ఖాన్ నటించిన టైగర్-3, కూడా టాప్-10లో నిలిచాయి. ఇక చాలా రోజుల తర్వాత రజినీకాంత్‌కు బంపర్ హిట్ ఇచ్చిన జైలర్, దళపతి విజయ్ నటించిన లియో, వారిసు సినిమాలు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ఓపెన్‌హైమర్ కూడా ఈ లిస్ట్‌లో ప్లేస్ దక్కించుకోవడం విశేషం.
గూగుల్ ప్రకటించిన టాప్-10 మూవీస్ ఇవే..
1. జవాన్
2. గదర్-2
3. ఓపెన్‌హైమర్
4. ఆదిపురుష్
5. పఠాన్
6. ది కేరళ స్టోరీ
7. జైలర్
8. లియో
9. టైగర్-3
10. వారిసు
టాప్-10 ఓటీటీ వెబ్ సిరీస్‌లు/ ట్రెండింగ్ షోస్
1. ఫర్జీ
2. వెడ్నెస్ డే
3. అసుర్
4. రానా నాయుడు
5. ది లాస్ట్ ఆఫ్ అస్
6. స్కామ్ 2003
7. బిగ్‌బాస్ 17
8. గన్స్ అండ్ గులాబ్స్
9. సెక్స్/లైఫ్
10. తాజా ఖబర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

