Goodachari sequel | త్వరలోనే గూఢచారి సీక్వెల్ అనౌన్స్మెంట్
గూఢచారి తిరిగొస్తున్నాడు..ఈ నెలలోనే ప్రకటన ఉంటుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అడివి శేష్ సీక్వెల్ స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.

స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చి మంచి హిట్ గా నిలిచింది గూఢచారి (Goodachari) . అడివి శేష్ (Adivi Sesh) లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. శోభితా దూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని మెయిన్ రోల్స్ లో నటించగా…అక్కినేని సుప్రియ ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన గూఢచారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ (Goodachari sequel) రెడీ అవుతోంది. ఆగస్టు 3తో మూడేళ్లు పూర్తి చేసుకుంది గూఢచారి. ఈ సందర్భంగా సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. గూఢచారి తిరిగొస్తున్నాడు..ఈ నెలలోనే ప్రకటన ఉంటుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అడివి శేష్ సీక్వెల్ స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఫస్ట్ పార్టు ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించగా..మరి సీక్వెల్ ను ఎవరు తెరకెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అడివి శేష్ లీడ్ రోల్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టు మేజర్ షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అడివి శేష్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

