కంటెంట్ ఉన్న కథ కచ్చితంగా నచ్చుతుంది
‘ఫుల్లెన్త్ కనిపించే ప్రధాన పాత్ర చేశానంతే. హీరోనని నేను అనుకోను. అసలు హీరో కావాలని నాకు లేదు. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు చేయడమే నాకిష్టం.
‘ఫుల్లెన్త్ కనిపించే ప్రధాన పాత్ర చేశానంతే. హీరోనని నేను అనుకోను. అసలు హీరో కావాలని నాకు లేదు. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు చేయడమే నాకిష్టం. కేరక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. అయితే.. ‘రాజుయాదవ్’ కథ విన్నాక ‘ఫుల్లెన్త్ నటించడానికి అవకాశం దొరికింది’ అనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను.’ అని గెటప్ శ్రీను అన్నారు.
ఆయన కథనాయకుడిగా నటించిన చిత్రం ‘రాజుయాదవ్’. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. నేడు సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గెటప్‌శ్రీను విలేకరులతో ముచ్చటించారు. ‘ ఇందులో నాది చాలా కష్టమైన పాత్ర. ఒకానొక దశలో ఫెయిల్ అయిపోయానేమో అనుకున్నా. దర్శకుడు ఇచ్చిన స్ఫూర్తి వల్లే ఇది సాధ్యమైంది. ఇందులోని విజువల్స్, సన్నివేశాలు, మాటలు.. అన్నీ సహజంగా ఉంటాయి.
కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి కచ్చితంగా జనానికి నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు గెటప్ శ్రీను. ఇంకా చెబుతూ-‘తల్లిదండ్రులు తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నారు? అలాగే కొడుకు కోణంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కు తగ్గకూడదని చెప్పే సినిమా ఇది. ఫన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ సినిమాను ఆవిష్కరించాడు దర్శకుడు కృష్ణమాచారి. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా కూడా అందరూ మెచ్చేలా సినిమా ఉంటుంది.’ అని తెలిపారు గెటప్ శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

