సాధారణంగా సినిమా షూటింగ్స్‌లో నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించరు. అయితే సినిమా మేకింగ్‌లో కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యనిచ్చే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా కోసం నిజమైన బంగారు అభరణాన్ని వినియోగించారట. వాటి విలువ దాదాపు మూడుకోట్లని తెలిసింది. సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ పౌరాణిక ప్రణయగాథ ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాకు స్టెలిష్ట్గా జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా వ్యవహరించింది. సమంత ధరించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారని తెలిసింది. యువరాణి శకుంతల పాత్రలో సహజత్వం కోసం నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించారట. సమంత ధరించిన చీరను ఒరిజినల్ ముత్యాలు పొదిగి రూపొందించారు. 30 కేజీల బరువు ఉండే ఈ చీరను ధరించి సమంత ఏడు రోజులు షూటింగ్లో పాల్గొన్నదని నీతా లుల్లా తెలిపింది. దిల్‌రాజు, నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.