Geethanjali Malli Vachindi | మరిన్ని భాషల్లో గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఏ ప్లాట్ఫాంలోనంటే?
Geethanjali Malli Vachindi | రాజోలు భామ అంజలి (Anjali) లీడ్ రోల్లో నటించిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). హార్రర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వం వహించాడు.
Geethanjali Malli Vachindi | రాజోలు భామ అంజలి (Anjali)కి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ లీడ్ రోల్లో నటించిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). హార్రర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వం వహించాడు. Anjali 50వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా సందడి చేస్తోంది. ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షించే అవకాశం వచ్చేసింది. ఇక హిందీలో కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మూవీ లవర్స్. మరి ప్రైమ్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి.
ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కించారు. అంజలి ఇటీవలే విశ్వక్ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది అంజలి.
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

