Geetha Arts | సినీ పరిశ్రమ వృద్ధికి ఐక్యంగా ఉన్నాం.. ఎక్స్‌లో గీతాఆర్ట్స్ సందేశం
Geetha Arts | తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ధన్యవాదాలు తెలియజేసింది.
Geetha Arts | తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారని తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో భాగంగా సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందిస్తున్న సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
ఒక పరిశ్రమగా ప్రభుత్వ ప్రగతిశీల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో అంకితభావంతో మేమంతా ఐక్యంగా ఉన్నాం. సమాజ అభివృద్ధికి, మా సినీ పరిశ్రమ నిరంతర వృద్ధికి గణనీయమైన సహకారం అందించాలని మేమంతా లక్ష్యంగా పెట్టుకున్నామని గీతా ఆర్ట్స్ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
We express our sincere gratitude to the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula garu, Cinematography Minister @KomatireddyKVR garu & Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast support in advancing the…
— Geetha Arts (@GeethaArts) December 26, 2024
Read Also :
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

