విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నటుడు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’. ఇందులో విశ్వక్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. కృష్ణచైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. మే 17న సినిమా విడుదల కానుంది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘మోత..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా, ఎం.ఎం.మానసి ఆలపించారు. హోలీ పర్వదినాన ఈ పాటను విడుదల చేస్తుండటం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. అందాల తార అయేషాఖాన్, విశ్వక్సేన్ తెరను పంచుకున్న ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణ అని మేకర్స్ చెబుతున్నారు.
నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహనిర్మాతలు. కెమెరా: అనిత్ మంధాడి, సమర్పణ: శ్రీకర్ స్టూడియోస్.