Vishwak Sen | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!
Gangs Of Godavari Movie | పదిహేను రోజుల కిందట రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ జనాలకు మాములుగా ఎక్కేలేదు. ముఖ్యంగా గోదావరి ప్రాంతలంలోని సినీ లవర్స్ సినిమా ఎప్పుడెప్పెడొస్తుందా అని పడిగాపులతో ఎదురు చూస్తున్నారు.
Gangs Of Godavari Movie | పదిహేను రోజుల కిందట రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ జనాలకు మాములుగా ఎక్కేలేదు. ముఖ్యంగా గోదావరి ప్రాంతలంలోని సినీ లవర్స్ సినిమా ఎప్పుడెప్పెడొస్తుందా అని పడిగాపులతో ఎదురు చూస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ మాస్ మేకోవర్కి ఆశ్చర్యపోని అభిమాని లేడు. అప్పుడెప్పుడో కెరీర్ బిగెనింగ్‌లో ఫలక్‌నుమా దాస్ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ చేశాడు. మళ్లీ మాస్ జోలికి వెళ్లలేదు. అయితే ఈ సారి మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మాస్ వేరే రేంజ్లో చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. కంటెంట్ కొత్తగా కనిపిస్తుంది. అవుట్ పుట్ అదిరిపోయే రేంజ్లో ఉంటే మాత్రం విశ్వక్ ఈ సారి బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేయడం ఖాయం.
రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. సుట్టంలా సూసి పోకలా అంటూ సాగే మెలోడియస్ ప్రోమో అదిరిపోయింది. యువన్ శంకర్ రాజా ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో ట్యూన్ ఉంది. మాములుగానే యువన్ మెలోడి పాటలకు తెగ ఫ్యాన్స్ ఉంటారు. గతకొంత కాలంగా ఆయన నుంచి ఆహా ఓహో అనిపించే రేంజ్లో ఒక్క మెలోడి సాంగ్ రాలేదు. అయితే ఇప్పుడు ఆ ఆశ తీరినట్లే అనిపిస్తుంది. యువన్ కంపోజింగ్‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ అనురాగ్ కులకర్ణి వోకల్స్ అందించాడు. ప్రోమోలో నేహాశెట్టి నేచురల్ లుక్‌లో అదిరిపోయింది.
ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో మరో 24గంటల్లో రిలీజ్ కానుంది. అంజలీ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Here’s the promo of #SuttamlaSoosi song from #GangsofGodavari 💞🌊
Full song out Tomorrow! ❤️
A @thisisysr magical melody 🎶 🎹
🎤 @anuragkulkarni_
✍️ @SriharshaEmani @VishwakSenActor @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84…— Sithara Entertainments (@SitharaEnts) August 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

